YSRCP: గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామీజీ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు జ‌గ‌న్‌కు ఆహ్వానం

ganapathi sachidananda swamijy birth day celebrations invitation to ys jagan
  • త్వ‌ర‌లో గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామీజీ 80వ జ‌న్మ‌దిన వేడుక‌లు
  • మైసూరు ద‌త్త పీఠంలో జ‌ర‌గనున్న వేడుక‌లు
  • వైవీ సుబ్బారెడ్డితో క‌లిసి జ‌గ‌న్‌ను ఆహ్వానించిన పీఠం ప్ర‌తినిధులు
అవ‌ధూత ద‌త్త పీఠాధిప‌తి గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామీజీ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు హాజ‌రు కావాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆహ్వానం అందింది. గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామీజీ త్వ‌ర‌లోనే త‌న 80వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను జ‌రుపుకోనున్నారు. అవ‌ధూత ద‌త్త పీఠంలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌ల‌కు హాజ‌రు కావాల్సిందిగా టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డితో క‌లిసి పీఠం ప్ర‌తినిధులు సోమ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి ఆహ్వానించారు.
YSRCP
YS Jagan
YV Subba Reddy
Avadutga Datta Peetham

More Telugu News