Skoda: ఎస్ యూవీ సెగ్మెంట్లో కుషాక్ మాంటేకార్లో ఎడిషన్ తీసుకువచ్చిన స్కోడా

Skoda brings Monte Carlo edition the latest version in Kushaq model
  • కుషాక్ లో కొత్త వెర్షన్
  • రెండు రంగులు, నాలుగు వేరియంట్లలో లభ్యం
  • ప్రారంభ ధర రూ.15.99 లక్షలు
  • హై ఎండ్ మోడల్ ధర రూ.19.49 లక్షలు 
కార్ల తయారీ దిగ్గజం స్కోడా భారత్ లో కుషాక్ కొత్త వెర్షన్ తీసుకువచ్చింది. ఎస్ యూవీ సెగ్మెంట్లో కుషాక్ మాంటేకార్లో ఎడిషన్ ను ఆవిష్కరించింది. ఇందులో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.15.99 లక్షలు కాగా, ఇందులో హై ఎండ్ మోడల్ ధర రూ.19.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). కుషాక్ మాంటేకార్లో ఎడిషన్ కారు ఎరుపు, తెలుపు రంగుల్లో వస్తోంది. 

బ్లాక్ ఫినిష్డ్ రూఫ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్రేక్ కాలిపర్స్, డ్యూయల్ టోన్డ్ థీమ్ క్యాబిన్, సౌకర్యవంతమైన సీటింగ్, 8.0 ఇంచ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, అల్యూమినియం పెడల్స్ మాంటేకార్లో ఎడిషన్ ప్రత్యేకతలు. మిగతావన్నీ స్కోడా కుషాక్ పాత మోడల్ తరహాలోనే ఉంటాయి.
Skoda
Monte Carlo
Kushaq
SUV
India

More Telugu News