ప్రసంగం మధ్యలో మంచినీళ్లు కోరిన ఉన్నతాధికారిణి... స్వయంగా తీసుకువచ్చి ఇచ్చిన నిర్మలా సీతారామన్
- ముంబయిలో ఎన్ఎస్ డీఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
- హాజరైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
- ప్రసంగించిన ఎన్ఎస్ డీఎల్ ఎండీ పద్మజ చుండూరు
- దాహంతో ఇబ్బందిపడిన వైనం
అయితే, వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. ఎన్ఎస్ డీఎల్ ఎండీ పద్మజ దాహంతో ఇబ్బందిపడడాన్ని గుర్తించిన నిర్మలా... వెంటనే స్పందించారు. స్వయంగా తానే నీళ్లు తీసుకువెళ్లి ఆ మహిళా ఉన్నతాధికారికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి అయ్యుండి, ఎంతో మానవీయ కోణంలో స్పందించిన తీరు పట్ల నిర్మలా సీతారామన్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.