Mahinda Rajapaksa: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా

  • ప్రజాగ్రహానికి తలవంచిన 
  • సంక్షోభంతో కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న శ్రీలంక
  • రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్న ఆందోళనలు
Sri Lanka PM Mahinda Rajapaksa resigns

ప్రజాగ్రహానికి శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తలవంచారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితికి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్సనే కారణమని శ్రీలంక ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 

రోడ్లపైకి వచ్చి ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. సైన్యం రంగంలోకి దిగినప్పటికీ వారు లెక్క చేయలేదు. అధ్యక్షుడు, ప్రధాని అధికార నివాసాలపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో చాలా చోట్ల ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చాయి. వీటిని కట్టడి చేయడానికి దేశ రాజధాని కొలంబోలో ఈరోజు కర్ఫ్యూ కూడా విధించారు. చివరకు విధిలేని పరిస్థితుల్లో ప్రధాని మహింద రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు.

More Telugu News