మోదీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ 'జీడీపీ' సెటైర్!
- గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.50 పెంపు
- జీడీపీ పెరుగుదలలో మోదీని మించిన వారు లేరన్న నాగేశ్వర్
- జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని సెటైర్
గ్యాస్ ధర పెంచుతూ మోదీ సర్కారు చేసిన ప్రకటనపై రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ సెటైరికల్ కామెంట్లు చేశారు. జీడీపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఒక్కరికీ సాధ్యం కాని రికార్డులను నమోదు చేశారన్న నాగేశ్వర్.. ఈ విషయంలో ఏ ఒక్కరు కూడా మోదీని ఓడించలేరని కూడా ఆయన వ్యంగ్యంగా అన్నారు. అయితే జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కాదన్న నాగేశ్వర్... గ్యాస్, డీజిల్, పెట్రోల్ అంటూ మోదీపై విమర్శలు గుప్పించారు.