Sundeep Kishan: 'మైఖేల్'గా సిక్స్ ప్యాక్ తో సందీప్ అదరగొట్టేస్తున్నాడే!

  • 'మైఖేల్'గా సందీప్ కిషన్ 
  • ఆయన సరసన నాయికగా నటించిన దివ్యాన్ష కౌశిక్ 
  • కీలకమైన పాత్రను పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ 
  •  తెలుగు .. తమిళ భాషల్లో జరగనున్న విడుదల
Michael Movie  first look released

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. ఒక వైపున నిర్మాతగాను .. మరో వైపున హీరోగాను ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. 'గల్లీరౌడీ' ఫరవాలేదని అనిపించుకున్నప్పటికీ ఆయన నుంచి ఇంతవరకూ మరో సినిమా లేదు. ఈ నేపథ్యంలోనే 'మైఖేల్' గా పలకరించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. 

శ్రీనివాస సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాకి రంజిత్ జైకోడి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్ తో పూర్తిగా యాక్షన్ లోకి దిగిపోయినట్టుగా చేతిలో గన్ తో ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 ఈ సినిమాలో సందీప్ జోడీగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. 'మజిలీ' .. 'రామారావు ఆన్ డ్యూటీ'  తరువాత ఈ బ్యూటీ చేసిన సినిమా ఇది. ఇక ఈ సినిమాలో మూడు కీలకమైన పాత్రలు ఉన్నాయి. చాలా పవర్ఫుల్ గా కనిపించే ఈ పాత్రల్లో విజయ్ సేతుపతి  .. గౌతమ్ మీనన్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు.

More Telugu News