TSRTC: టీఎస్ఆర్టీసీ మదర్స్ డే స్పెషల్ ఆఫర్.. ఐదేళ్లలోపు పిల్లలుంటే ఆదివారం ఉచిత ప్రయాణం

TSRTC Announces Free Journey For Mothers in the eve of Mothers day
  • రేపు మాతృదినోత్సవం
  • మదర్స్ డే కానుకగా టికెట్ వసూలు చేయబోమన్న ఆర్టీసీ
  • చంటి పిల్లల తల్లులు వినియోగించుకోవాలని సూచన
మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. మదర్స్ డే‌ జరుపుకునే రేపు (ఆదివారం) ఆర్టీసీ బస్సుల్లో చంటి పిల్లలతో ప్రయాణించే మహిళల నుంచి టికెట్ వసూలు చేయబోమని ప్రకటించింది. ఐదేళ్లలోపు పిల్లలతో వెళ్లే తల్లులు పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లులను అభినందించే ఉద్దేశంతోనే ఈ కానుకను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఆఫర్ ఆదివారం ఒక్క రోజు మాత్రమేనని, చంటిపిల్లల తల్లులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
TSRTC
VC Sajjanar
Bajireddy Govardhan
Mother's Day

More Telugu News