Sajjala Ramakrishna Reddy: మరో ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి

will go to elections less than two years said sajjala Ramakrishna Reddy
  • వైసీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందన్న సజ్జల
  • జగన్ పథకాలు విజయవంతమయ్యాయని వెల్లడి
  • ప్రతిపక్షాలది వాపు మాత్రమేనన్న ప్రభుత్వ సలహాదారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. మరో ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. తమ ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి బాగా వెళ్లిందని, జగన్ అమలు చేసిన పథకాలు విజయవంతమయ్యాయని అన్నారు. తాము మరింత బలోపేతమవుతున్నామని, ప్రజల్లో తమపై ఉన్న ఆదరణ మరింత పెరిగిందని అన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్న పార్టీలన్నీ ఒక్కటై ఎన్నికలకు వెళ్తే వైసీపీ ఎదుర్కోగలదా? అన్న విలేకరుల ప్రశ్నకు సజ్జల మాట్లాడుతూ.. వారంతా కలిసి ఉన్నా, విడిపోయినా వారిది వాపు మాత్రమేనని, బలుపు కాదని అన్నారు. వారందరూ గతంలోనూ కలిసే ఉన్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు వారంతా కలిసే ఉన్నట్టు నమ్మిస్తారని, అధికారంలో లేనప్పుడు కలిసి బలం చూపించే ప్రయత్నం చేస్తారని సజ్జల విమర్శించారు.
Sajjala Ramakrishna Reddy
Andhra Pradesh
YSRCP

More Telugu News