Rahul Gandhi: టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉంది: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

Rahul Gandhi alleges TRS had a secret pact with BJP
  • తెలంగాణలో గెలవలేమని బీజేపీకి తెలుసని వ్యాఖ్యలు
  • అందుకే రిమోట్ కంట్రోల్ తో పాలిస్తోందని వెల్లడి
  • అధికారంలో టీఆర్ఎస్ ఉండాలనే బీజేపీ కోరుకుంటుందని విమర్శలు

వరంగల్ రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మోదీ రైతు చట్టాలను తీసుకువచ్చినప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని అన్నారు. అందుకే రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిందని వెల్లడించారు. తెలంగాణలో గెలవలేం కాబట్టే బీజేపీ రిమోట్ కంట్రోల్ తో పాలిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తాము చెప్పినట్టు ఆడే టీఆర్ఎస్ సర్కారే ఉండాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంత దోచుకున్నా ఈడీ, ఐటీలు ఇక్కడికి రావని అన్నారు.

  • Loading...

More Telugu News