Bojjala Gopala Krishna Reddy: బొజ్జ‌ల భౌతిక కాయానికి నివాళి అర్పించిన నారా లోకేశ్

nara lokesh paid tributes to the mortal remains of Bojjala Gopalakrishna Reddy
  • అనారోగ్యంతో క‌న్నుమూసిన బొజ్జ‌ల‌
  • బొజ్జ‌ల ఔన్న‌త్యాన్ని కీర్తిస్తూ లోకేశ్ ట్వీట్‌
  • తనయుడు సుధీర్ రెడ్డిని ఓదార్చిన టీడీపీ నేత‌
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి భౌతిక కాయానికి శుక్ర‌వారం రాత్రి ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నివాళి అర్పించారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న బొజ్జ‌ల శుక్ర‌వారం మధ్యాహ్నం హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

 బొజ్జ‌ల మృతి వార్త తెలిసినంత‌నే.. బొజ్జ‌ల ఔన్న‌త్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ‌భ‌రిత ట్వీట్‌ను పోస్ట్ చేసిన లోకేశ్... రాత్రి నేరుగా బొజ్జ‌ల నివాసానికి వెళ్లారు. ఆయన మృత‌దేహంపై పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. బొజ్జ‌ల కుమారుడు, టీడీపీ యువ‌నేత బొజ్జ‌ల సుధీర్ రెడ్డిని ఆయ‌న ఓదార్చారు.
Bojjala Gopala Krishna Reddy
Nara Lokesh
TDP
Bojjala Sudhir Reddy

More Telugu News