Andhra Pradesh: వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు అమ‌ర్చుతాం: ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ap cm ys jagan said that will establish meters to agricultural motors
  • శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజ‌యవంత‌మైంది
  • మీట‌ర్ల వ‌ల్ల సాగుకు నాణ్య‌మైన విద్యుత్ అందుతుంది
  • రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే మీట‌ర్ల‌పై దుష్ప్ర‌చార‌మ‌న్న జ‌గ‌న్‌
వ్య‌వ‌సాయ రంగానికి ఇస్తున్న విద్యుత్‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం క్యాంపు కార్యాల‌యంలో వ్య‌వ‌సాయ శాఖ‌పై స‌మీక్ష చేసిన సందర్భంగా జ‌గ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో త్వ‌ర‌లోనే వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌కటించారు. 

ఈ దిశ‌గా శ్రీకాకుళం జిల్లాలో చేప‌ట్టిన‌ పైల‌ట్ ప్రాజెక్టు విజ‌య‌వంతం అయ్యిందని ఆయ‌న గుర్తు చేశారు. వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల ఏర్పాటు వ‌ల్ల నాణ్య‌మైన విద్యుత్ అందుతుందన్న జ‌గ‌న్‌... రైతుల‌కు మెరుగైన విద్యుత్ ఇవ్వ‌గ‌లమ‌ని పేర్కొన్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే సాగు మోటార్ల‌కు మీట‌ర్ల‌పై విప‌క్షాలు దుష్ప్ర‌చారం చేస్తున్నాయ‌ని కూడా ముఖ్యమంత్రి ఆరోపించారు.

సమీక్షలో భాగంగా రైతు భరోసా, రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై జ‌గ‌న్‌ సమీక్షించారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌... జూన్‌ మొదటి వారంలో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తామ‌న్నారు. అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4014 వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామ‌ని, 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్‌సెంటర్లకు ఇవ్వ‌నున్నామని తెలిపారు.
Andhra Pradesh
Electricity Meters
YSRCP
YS Jagan

More Telugu News