Parrot: ఎగిరిపోయిన రామచిలుక... పట్టిస్తే నజరానా!

Family announced cash reward for missing parrot
  • బీహార్ లోని గయ ప్రాంతంలో ఘటన
  • పన్నెండేళ్లుగా చిలుకను పెంచుకుంటున్న శ్యామ్ దేవ్ కుటుంబం
  • ఇటీవల కనిపించకుండా పోయిన చిలుక
  • చుట్టుపక్కల ప్రాంతాల్లో పోస్టర్లు వేసిన యజమాని
  • పట్టిస్తే రూ.5,100 ఇస్తామని వెల్లడి
బీహార్ లోని ఓ కుటుంబం తమ పెంపుడు చిలుక కోసం అలమటిస్తోంది. గయ ప్రాంతంలో నివసించే శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా, సంగీత దంపతులు ఓ రామచిలుకను గత 12 ఏళ్లుగా ఎంతో ముచ్చటపడి పెంచుకుంటున్నారు. ఇటీవల ఆ చిలుక అదృశ్యమైంది. ఎటు ఎగిరివెళ్లిందో తెలియక శ్యామ్ దేవ్ ప్రసాద్ కుటుంబం తీవ్ర విచారానికి గురైంది. కన్నబిడ్డలా చూసుకుంటున్న చిలుక కనిపించకపోవడంతో ఆ కుటుంబం అనేక ప్రాంతాల్లో వెదికింది. 

అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గయ పరిసర ప్రాంతాల్లో చిలుక బొమ్మతో పోస్టర్లు వేశారు. చిలుకను పట్టిస్తే రూ.5,100 నజరానా ఇస్తామని ప్రకటించారు. తమ ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు. అటు సోషల్ మీడియాలో కూడా చిలుక గురించి ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తమ చిలుకను తీసుకెళితే దయచేసి తిరిగి ఇచ్చేయాలని శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Parrot
Gaya
Reward
Posters
Bihar

More Telugu News