కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంగా మారింది: జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు
- టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి
- మిషన్ భగీరథలోనూ భారీ అవినీతి
- తెలంగాణ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందన్న నడ్డా
తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని నడ్డా ఆరోపించారు. తెలంగాణలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్న కాళేశ్వరం సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణ రజాకార్ సమితి అని కూడా మరింత ఘాటు ఆయన వ్యాఖ్యలు గుప్పించారు.