'ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ ఇక చాలు' అంటూ ఇద్దరు పిల్లలతో దిగిన ఫొటోపై పూనమ్ కౌర్ క్లారిటీ
- ఇటీవల ఇద్దరు పిల్లలతో ఫొటో దిగి పోస్ట్ చేసిన పూనమ్ కౌర్
- పూనమ్ కౌర్‌కి పెళ్లయి పిల్లలు ఉన్నారట అంటూ కొందరు పోస్టులు
- ఆ ఫొటోలో ఉన్నది తన స్నేహితుల పిల్లలని తెలిపిన కౌర్
ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసిన పూనమ్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'భరించలేని విధంగా ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ ఇక చాలు' అని ఆమె పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఉన్నది తన స్నేహితుల పిల్లలని తెలిపింది. దీనిపై స్పష్టత నిచ్చే అవకాశం ఇచ్చినందుకు సోషల్ మీడియాకు థ్యాంక్స్ అంటూ ఆమె పేర్కొంది.