Rahul Gandhi: తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన.. ఎప్పుడు? ఎక్కడ?.. షెడ్యూల్ ఇదే!

Congress leader Rahul Gandhi To Arrive Hyderabad tomorrow for two day visit
  • రేపు హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్
  • వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో రైతు సంఘర్షణ సభ
  • రేపు రాత్రికి తాజ్‌కృష్ణలో బస
  • 7న మాజీ సీఎం సంజీవయ్యకు నివాళి
  • గాంధీభవన్‌లో నేతలతో భేటీ
  • అనంతరం ఢిల్లీకి పయనం
రెండు రోజల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (శుక్రవారం) ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. 5.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ బయలుదేరి 5.45 గంటలకు వరంగల్‌లోని గాబ్రియెల్ స్కూలుకు చేరుకుంటారు. 6.05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రాత్రికి బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో బస చేస్తారు.

మరుసటి రోజైన శనివారం 12.30 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్క్‌కు చేరుకుంటారు. 12.50-1.10 మధ్య దివంగత మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. 2.45 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం మెంబర్‌షిప్ కోఆర్డినేటర్లతో రాహుల్ ఫొటోలు దిగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరడంతో హైదరాబాద్‌లో ఆయన పర్యటన ముగుస్తుంది.
Rahul Gandhi
Congress
Telangana
Hyderabad
Warangal
Rytu Sangharshana Sabha

More Telugu News