Andhra Pradesh: అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి: ఏపీ హోంమంత్రి తానేటి వనిత

AP Home Minister Taneti Vanita once again made Controversial comments on Rape Cases
  • మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరుకు వచ్చిన మంత్రి 
  • మీడియా వద్ద రేపల్లె ఘటనపై స్పందించిన వనిత 
  • దుండగులు ఆమెపై అత్యాచారం చేసేందుకు రాలేదన్న మంత్రి
  • పేదరికం, మానసిక పరిస్థితులే అఘాయిత్యాలకు కారణమని వ్యాఖ్య 
ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న గుంటూరుకు వచ్చిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రేపల్లె అత్యాచార ఘటనపై స్పందించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడే ఉద్దేశంతో రాలేదన్నారు. మద్యం మత్తులో ఉన్న వారు డబ్బుల కోసం బాధితురాలి భర్తపై దాడి చేశారని, ఆ సమయంలో భర్తను రక్షించుకోవడానికి ఆమె వెళ్లిందని అన్నారు. ఆ సందర్భంగా నిందితులు ఆమెను నెట్టేసే క్రమంలోనే ఆమె అత్యాచారానికి గురైనట్టు చెప్పారు. 

పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అన్నారు. ఆమెపై అత్యాచారానికి, పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదన్నారు.  
Andhra Pradesh
Taneti Vanita
Rapalle Rape Case
Guntur District

More Telugu News