సినీ కార్మికోత్సవం నాడు దాసరి నారాయణరావు ప్రస్తావనే లేకపోవడం బాధాకరం. నిర్మాత సి.కల్యాణ్
- మే డే సందర్భంగా సినీ కార్మికోత్సవం
- హాజరైన తెలంగాణ మంత్రులు, చిరంజీవి
- దాసరిని విస్మరించారన్న సి.కల్యాణ్
- తప్పు జరిగిందన్న ఫిలిం ఫెడరేషన్
సి.కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ వివరణ ఇచ్చారు. సినీ కార్మికోత్సవంలో దాసరి నారాయణరావు ఫొటో ఏర్పాటు చేశామని, కానీ దండ వేయడం మర్చిపోయామని చెప్పారు. తాము చేసింది తప్పేనని అనిల్ అంగీకరించారు. ఇకపై తాము ఏ కార్యక్రమం చేపట్టినా దాసరికి సముచిత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
మే డే సందర్భంగా నిర్వహించిన సినీ కార్మికోత్సవంలో మంత్రి తలసాని మాట్లాడుతూ, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవేనని అన్నారు. అటు, 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు సైతం చిరంజీవిని పరిశ్రమ పెద్దగా ప్రకటించారు.