అమీర్ పేట పరిధిలో... ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి రాసలీలలు!

  • బీకే గూడలో ఓ ఇంటికి టు-లెట్ బోర్డు
  • ఇల్లు అద్దెకు కావాలని యజమానితో మాట్లాడిన జంట 
  • పై పోర్షన్ ఖాళీగా ఉందన్న యజమాని
  • చూడడానికి వెళ్లి ఎంతకీ కిందికి రాని జంట
  • పైకి వెళ్లి చూసి దిగ్భ్రాంతికి గురైన ఓనర్
Couple caught in intimate action pretext of house seeking

సాధారణంగా ఇల్లు అద్దెకు కావాలనుకునే వారు ఎక్కడైనా టు-లెట్ బోర్డు కనిపిస్తే, ఆ ఇంటి యజమానిని అడిగి వివరాలు తెలుసుకోవడం సహజం. ఇంట్లోకి ప్రవేశించి తమ అవసరాలకు అనుగుణంగా అక్కడి ఏర్పాట్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించడం సాధారణ విషయం. కానీ హైదరాబాదులో ఓ జంట తమ శారీరక సుఖం కోసం మాస్టర్ ప్లాన్ వేసింది. 

అమీర్ పేట పరిధిలోని బీకే గూడలో టు-లెట్ బోర్డు తగిలించి ఉన్న ఇంటి వద్దకు బైక్ పై ఓ యువతి, యువకుడు వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని ఆ ఇంటి యజమానిని అడిగారు. పై పోర్షన్ ఖాళీగా ఉందని ఇంటి యజమాని చెప్పడంతో వారిద్దరూ చూడడానికి పైకి వెళ్లారు. అయితే, వారు ఎంతకీ కిందికి రాకపోవడంతో ఇంటి యజమాని పై పోర్షన్ కు వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. 

ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన యువతి, యువకుడు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. దాంతో ఇంటి యజమాని ఆగ్రహంతో కేకలు వేయగా, వారిద్దరూ అక్కడ్నించి ఉడాయించారు. యువతి రోడ్డుపై పరుగులు తీయగా, యువకుడు తన బైక్ పై హడావుడిగా వెళ్లిపోయిన వైనం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిచ్చాయి.

కాగా, జరిగిన ఘటనపై ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజిని కూడా పోలీసులకు అందించారు. ఏదేమైనా ఇలాంటి ఘటన పట్ల పోలీసులు కూడా ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది.

More Telugu News