ఆకట్టుకుంటున్న మ‌హేశ్ బాబు 'నేను విన్నాను.. నేను ఉన్నాను' డైలాగ్!

  • నేను విన్నాను..నేను ఉన్నానంటూ గ‌తంలో వైఎస్సార్ నోట భ‌రోసా మాట‌
  • యాత్ర సినిమాలో జ‌నాన్ని ఆక‌ట్టుకున్న డైలాగ్‌
  • ప్రజాసంకల్ప యాత్రలో జగన్ నోట వినపడిన మాట 
  • తాజాగా 'సర్కారు వారిపాట' ట్రైలర్ లో మహేశ్ బాబు నోట 
ysr popular dialogue in sarkaru vaari paata trailer

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజా చిత్రం స‌ర్కారువారి పాట ట్రైల‌ర్ సినీ ప్రేక్ష‌కుల‌ను ఇట్టే అల‌రిస్తోంది. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో మ‌హేశ్ బాబు ప‌లు వేరియేష‌న్ల‌తో కూడిన డైలాగ్‌లు చెప్పారు. ఇలాంటి డైలాగుల్లో ఓ డైలాగ్ అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

విదేశాల్లో చ‌దువుకుంటున్న హీరోయిన్ కీర్తి సురేశ్... త‌న ఎగ్జామ్ ఫీజు క‌ట్టేందుకు ఇబ్బంది ప‌డుతూ ఓ ప‌ది వేల డాల‌ర్లు సాయం చేస్తే టాప్ ర్యాంకు తెచ్చుకుంటానంటూ చెప్పిన స‌మ‌యంలో 'నేను విన్నాను... నేను ఉన్నాను' అంటూ మ‌హేశ్ బాబు పొలిటీషియ‌న్ మాదిరి డైలాగ్ చెబుతారు.

వైఎస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన 'యాత్ర' సినిమాలో ఈ డైలాగ్ ఆక‌ట్టుకుంది. ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి ప్ర‌జ‌ల క‌ష్టాలు వింటూ ముందుకు వెళుతున్న స‌మ‌యంలో నేను విన్నాను... నేను ఉన్నాను అంటూ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తూ సాగిన వైనాన్ని ఆ సినిమాలో చూపించారు. అది బాగా పాప్యులర్ కావడంతో తన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ప్రతి మీటింగులోనూ ఇదే డైలాగును చెబుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. తాజాగా మ‌హేశ్ బాబు సినిమాలోనూ వినిపించిన ఈ డైలాగ్ మ‌రింత‌గా ఆస‌క్తి రేకెత్తిస్తోంది,

More Telugu News