Vijay Sai Reddy: నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న మహిళ ఎవరో వెల్లడించిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy revealed who is the woman besides Rahul Gandhi in Nepal night club
  • ఖాట్మండులో నైట్ పార్టీలో పాల్గొన్న రాహుల్
  • రాహుల్ పక్కనున్న మహిళ చైనా రాయబారి హౌ యాంక్వీ అని తెలిపిన విజయసాయి 
  • చైనా హనీ ట్రాప్ అంశాన్ని ప్రస్తావించిన వైసీపీ ఎంపీ  
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటూ కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్లబ్ లో ఆయన పక్కన ఓ మహిళ ఉండడం మరింతగా విమర్శలకు దారితీసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కాంగ్రెస్ వర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర అంశం వెల్లడించారు. 

నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీతో పార్టీ చేసుకుంటూ కనిపించినది చైనా దౌత్యవేత్తలని తెలిపారు. రాహుల్ పక్కన ఉన్న మహిళ నేపాల్ లో చైనా రాయబారి హౌ యాంక్వీ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే, రాహుల్ నైట్ క్లబ్ పార్టీకి సంబంధించిన వీడియో నేపథ్యంలో చైనా హనీట్రాప్ ఎత్తుగడలు మరోసారి తెరపైకి వచ్చాయని తన ట్వీట్ లో ప్రస్తావించారు. అంతేకాదు, నరేంద్ర మోదీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ అనవసర వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో, ఇప్పుడు ఆ పార్టీ సొంత నేతే వివాదంలో చిక్కుకున్నాడని విజయసాయి వివరించారు.
.
Vijay Sai Reddy
Rahul Gandhi
Hou Yanqui
Night Club
Nepal
Congress

More Telugu News