Keerthy Suresh: మహేశ్ బాబుకు క్షమాపణ చెప్పిన కీర్తి సురేశ్.. మూడు సార్లు కొట్టానని వెల్లడి

Keerthi For This Reason Apologizes Mahesh Babu
  • సర్కారు వారి పాట షూటింగ్ లో సరదా ఘటన
  • గుండె వేగం రెట్టింపైందని చెప్పిన హీరోయిన్
  • మహేశ్ బాబు కూడా సరదా వ్యాఖ్యలు చేశారని వెల్లడి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు హీరోయిన్ కీర్తి సురేశ్ క్షమాపణలు చెప్పింది. 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన సరదా సన్నివేశాలను ఉదహరిస్తూ ఆమె సారీ చెప్పింది. తన పంచ్ డైలాగులతో మహేశ్ బాబు టీజ్ చేశారా? లేదా? అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పింది. 

మహేశ్ బాబుతో షూటింగ్ చేయడం సరదా సరదాగా ఉంటుందని చెప్పింది. ఓ పాట షూటింగ్ సందర్భంగా తాను టైమింగ్ ను కోల్పోయానని, స్టెప్పులు మరిచిపోయానని చెప్పింది. అదే సమయంలో మహేశ్ మొహంపై రెండు సార్లు మిస్ టైమింగ్ తో కొట్టానని చెప్పింది. అప్పటికే సారీ చెప్పానని, మూడో సారీ అది రిపీట్ అయిందని ఆమె పేర్కొంది. ఆ టైంలో తన గుండె వేగం రెట్టింపైందని చెప్పింది. ‘నా మీద ఏమైనా పగ ఉందా?’ అంటూ మహేశ్ తనను సరదాగా అడిగారని చెప్పింది. 

  • Loading...

More Telugu News