వొడాఫోన్ ఐడియా ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు

01-05-2022 Sun 11:25
  • రూ.29, రూ.39, రూ.98
  • ఇవన్నీ యాడాన్ డేటా ప్లాన్లు
  • రూ.195, రూ.319
  • ఇవి నెలవారీ ప్లాన్లు
Vodafone Idea announces new prepaid plans starting at Rs 29
వొడాఫోన్ ఐడియా రూ.29, రూ.39, రూ.98, రూ.195, రూ.319 ధరలతో ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. చౌక ప్లాన్లను కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకొచ్చినట్టు సంస్థ ప్రకటించింది.
 
రూ.29 అన్నది యాడాన్ ప్లాన్. రోజువారీ ఉచిత డేటా పరిమితి అయిపోయిన తర్వాత రీచార్జ్ చేసుకోవడానికి, రెండు రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా ఈ ప్లాన్ కింద లభిస్తుంది.

రూ.39 అన్నది 4జీ డేటా వోచర్. రోజువారీ అధిక వేగంతో కూడిన డేటా పరిమితి అయిపోయిన వెంటనే దీన్ని రీచార్జ్ చేసుకుంటే తిరిగి డేటా లభిస్తుంది. 3జీబీ డేటా 7 రోజుల కాల పరిమితితో పొందొచ్చు. 

రూ.98 ప్లాన్ లో 21 రోజుల కాలవ్యవధితో 9జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.195 ప్లాన్ 31 రోజుల కాలవ్యవధితో వస్తుంది. 2జీబీ డేటా లభిస్తుంది. 300 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాల్స్ ఉచితంగా పరిమితి లేకుండా చేసుకోవచ్చు. 

రూ.319 ప్లాన్ లో రోజువారీగా 100 ఎస్ఎంఎస్ లు, 2జీబీ డేటాను పొందొచ్చు. కాల్స్ కూడా అన్  లిమిటెడ్ గా చేసుకోవచ్చు. సర్కిళ్ల వారీగా ఈ ప్లాన్లలో మార్పులు ఉండొచ్చు.