Chandrababu: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో అల్లాడిపోతున్నాయి: చంద్ర‌బాబు

Chandrababu Naidu slams ysrcp
  • అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్ర‌బాబు
  • రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రావ‌ట్లేద‌ని విమ‌ర్శ‌
  • కార్మిక లోకం తల్లడిల్లి పోతుందని వ్యాఖ్య‌
  • కనీసం కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంద‌ని ట్వీట్
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. కార్మికులు పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న‌ అన్నారు. ''శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో  పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారు. నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది

అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో అల్లాడిపోతుంటే.... కార్మిక లోకం తల్లడిల్లి పోతుంది. కనీసం కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి నేడు ఉంది.

ఇప్పటికైనా కార్మిక లోకమంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్ఫూర్తితో పోరాడాలి. కార్మిక, శ్రామిక లోకానికి మేలు చేసే ఏ పోరాటానికైనా తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుంది'' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.
Chandrababu
Andhra Pradesh
YSRCP

More Telugu News