Vijay Babu: నటుడు విజయ్ బాబు నా పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించాడు.. ముందుకొచ్చిన మరో మహిళ

Another woman accuses actor Vijay Babu of harassment
  • మళయాళ నటుడి లీలలు ఒక్కోటి వెలుగులోకి
  • తనను కిస్ చేయబోయాడని ఆరోపించిన ఓ మహిళ
  • ఇప్పటికే అతడిపై అత్యాాచారం కేసు
  • బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన విజయ్ బాబు

మళయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబు తనపై అత్యాచారం చేశాడంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసి కొన్ని రోజులు కూడా కాలేదు.. మరో మహిళ ముందుకు వచ్చి అతడికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. సినిమాకు సంబంధించి అతడితో కలిసి పనిచేస్తున్న సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆమె తెలిపారు. ఈ ఘటన తనను సినిమా పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయేలా చేసినట్టు చెప్పారు. 


‘‘అతడు మద్యం సేవించి ఉన్నాడు. నాకు కూడా మద్యాన్ని ఆఫర్ చేశాడు. తిరస్కరించి నా పని నేను చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి నా వద్దకు వచ్చి పెదాలపై ముద్దు పెట్టబోయాడు. నేను వేగంగా స్పందించి వెనక్కి జరిగాను. సీరియస్ గా అతడి వైపు చూశాను. ఒకే ఒక్క ముద్దు అని కోరాడు. అప్పటికి అతడితో నాకున్నది 30 నిమిషాల పరిచయమే’’అంటూ తాను ఎదుర్కొన్న అనుభవాన్ని ఆమె బయటపెట్టారు. 

మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయ్ బాబు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేయడంతో బాబు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు అయిన నాటి నుంచి అతడు కనిపించడం లేదని, దేశం విడిచి పారిపోయాడనే వదంతులు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News