నడుస్తున్న రైలు నుంచి యువతిని తోసేసిన తోటి ప్రయాణికుడు

  • మధ్యప్రదేశ్ లో ఘాతుకం
  • రైల్లో ప్రయాణిస్తున్న యువతి
  • వేధింపులకు పాల్పడిన వ్యక్తి
  • తీవ్రంగా ప్రతిఘటించిన యువతి
Co Passenger thrown woman from running train

మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. ఓ దుర్మార్గుడు నడుస్తున్న రైలు నుంచి పాతికేళ్ల యువతిని కిందికి తోసేశాడు. ఉత్తరప్రదేశ్ బందా జిల్లాకు చెందిన యువతి మధ్యప్రదేశ్ చత్తర్ పూర్ లో ఉన్న భాగేశ్వర్ డ్యామ్ చూసేందుకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో రైలు ఎక్కిన ఆమెకు తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అయితే, ఆ యువతి అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దాంతో ఆ వ్యక్తి యువతిని రైలు నుంచి కిందికి తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను రైల్వే పోలీసులు చత్తర్ పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

దీనిపై జిల్లా ఎస్పీ వినాయక్ వర్మ స్పందిస్తూ, ఈ ఘటన ఈ నెల 27వ తేదీన జరగిందని వెల్లడించారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహో, యూపీలోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగిందని తెలిపారు. యువతిని తోసేసిన వ్యక్తిని గుర్తించామని, అతడ్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు.

More Telugu News