TDP: బొత్స రాజీనామా చేయాలని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు డిమాండ్‌

tdp ap chief atchennaidu demands botsa ratyanarayana resignation
  • వ‌రుస‌గా టెన్త్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ ఘ‌ట‌న‌లు
  • ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌న్న అచ్చెన్న‌
  • స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని డిమాండ్‌
ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని టీడీపీ ఏపీ చీఫ్ కింజ‌రాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఏపీలో ఇటీవ‌లే మొద‌లైన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్నాప‌త్రం వ‌రుస‌గా లీక‌వుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్న‌సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టెన్త్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీని ప్ర‌శ్నిస్తూ శ‌నివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌న్నారు. ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీకి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ విద్యా శాఖ‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌క్ష‌ణ‌మే త‌న మంత్రి ప‌దవికి రాజీనామా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించాలని అచ్చెన్నాయుడు కోరారు.
TDP
Kinjarapu Acchamnaidu
10th Question Paper
Botsa Satyanarayana

More Telugu News