Lucknow super gaints: స్టుపిడ్ క్రికెట్ ఆడాం.. :కేఎల్ రాహుల్

  • తెలివిగా ఆటను అర్థం చేసుకోవాలి
  • స్మార్ట్ గా ఆడాలి
  • బ్యాటింగ్ విషయంలో నిరాశ చెందా
  • మ్యాచ్ అనంతరం మాట్లాడిన లక్నో కెప్టెన్
Lucknow played stupid cricket with the bat

బౌలర్ల కృషితో పంజాబ్ కింగ్స్ పై లక్నో విజయం సాధించగలిగింది. దీంతో తమ జట్టు బ్యాటింగ్ తీరు పట్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అసహనానికి గురయ్యాడు. ‘మా వాళ్లు బ్యాట్ తో స్టుపిడ్ క్రికెట్ (తెలివిలేకుండా ఆడడం) ఆడారు’అని వ్యాఖ్యానించాడు. శుక్రవారం నాటి మ్యాచ్ లో లక్నో జట్టు ఆటగాళ్లు వేగంగా వికెట్లు పోగొట్టుకోవడం తెలిసిందే. ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్య, కేఎల్ రాహుల్ షాట్లు ఆడబోయి ఒక అంకె స్కోరే చేశారు. దీంతో మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడాడు.

నేను నిరాశ చెందాను. బ్యాట్ తో మెరుగ్గా ఆడాల్సింది. క్వింటన్, దీపక్ బ్యాటింగ్ తో చక్కగా రాణించారు. వికెట్ కష్టంగా ఉన్న చోట 9 ఓవర్లకు 60 పరుగులు సాధించారు. మేము స్మార్ట్ గా బ్యాటింగ్ చేస్తే 180-190 పరుగులు సాధించి ఉండేవాళ్లం. ఆటను అర్థం చేసుకునే విషయంలో తెలివిగా ఉండాలి. ఎక్కువ షాట్లకు ప్రయత్నించకుండా ఉంటే మరింత మెరుగైన స్కోరు వచ్చేది. ఫీల్డింగ్, బౌలింగ్ విషయంలో మెరుగ్గా ఉన్నాం’’అని రాహుల్ పేర్కొన్నాడు. లక్నో బౌలర్లు దుష్మంత్ చమీర 11 పరుగులకే 2 వికెట్లు తీయగా.. మోమిసిన్ ఖాన్ 3 వికెట్లు, కృనాల్ పాండ్య 11 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు. దీంతో పంజాబ్ జట్టు చేధనలో చతికిలపడింది. 

More Telugu News