Roja: హైదరాబాదులో చిరంజీవి నివాసానికి వెళ్లిన ఏపీ మంత్రి రోజా... ఫొటోలు ఇవిగో!

AP Minister Roja met Chiranjeevi in Hyderabad
  • హైదరాబాదులో రోజా పర్యటన
  • కుటుంబ సమేతంగా చిరు దంపతులను కలిసిన వైనం
  • ఆత్మీయ స్వాగతం పలికిన చిరంజీవి, సురేఖ
  • రోజాకు శాలువా కప్పి సన్మానం

ఏపీ క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖ మంత్రి రోజా హైదరాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సమేతంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి, ఆయన అర్ధాంగి సురేఖ... రోజాను, ఆమె భర్త సెల్వమణిని, పిల్లలను సాదరంగా ఆహ్వానించారు. 

ఆచార్య విడుదల సందర్భంగా రోజా శుభాకాంక్షలు తెలుపగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు రోజా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలవడం తెలిసిందే. 

  • Loading...

More Telugu News