KTR: ఏపీలో కరెంట్, నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి: తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్

KTR sensational comments on AP
  • ఏపీ పరిస్థితుల గురించి తన మిత్రులు చెప్పారన్న కేటీఆర్
  • ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టుందని అన్నారని వ్యాఖ్య
  • దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్న మంత్రి
ఏపీపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని... ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. 

తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని... దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని తెలిపారు.  నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపే అవకాశం ఉంది. క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
KTR
TRS
Andhra Pradesh
Roads

More Telugu News