Sai Dharam Tej: జెస్సీ.. ఏం మాయ చేశావో అంటూ.. సామ్ పై సాయిధరమ్ ట్వీట్

Sai Dharam Tej Wishes To Samantha
  • వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సాయితేజ్ 
  • 'నీ వీరాభిమాని' అంటూ కామెంట్
  • సామ్ కు పలువురు ప్రముఖుల విషెస్

సమంతకు టాలీవుడ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ కొంచెం కొత్తగా విషెస్ చెప్పాడు. సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని సాయి తేజ్ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ అభిమానాన్ని పుట్టినరోజు శుభాకాంక్షలతో చాటుకున్నాడు. 

‘‘జెస్సీ.. నువ్వు ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లిపోయింది మనసు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు సామ్.. నీ వీరాభిమాని’’ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. సామ్ నవ్వుతూ అందంగా కనిపించే బ్లాక్ అండ్ వైట్ ఫొటోను తన శుభాకాంక్షలకు జోడించాడు. ఇప్పుడు అతడు చెప్పిన విషెస్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 

అతడితో పాటు టాలీవుడ్ దర్శకురాలు నందిని రెడ్డి, కీర్తి సురేశ్, త్రిష, కంగనా రనౌత్, రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, వరుణ్ ధవాన్, ఉపాసన, పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News