'మిమ్మల్ని చూసే నటుడిగా మారాను' అంటూ స‌త్య‌దేవ్ ట్వీట్.. చిరు రిప్లై

 Actor SatyaDev thank you says chiru
  • 'నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు' అన్న స‌త్య‌దేవ్
  • ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగిందని వ్యాఖ్య‌
  • నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషమ‌న్న చిరు
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'ఆచార్య' సినిమా రేపు విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడు స‌త్య‌దేవ్ చిరంజీవి గురించి ఆస‌క్తికర ట్వీట్ చేయ‌గా దానిపై చిరు స్పందించారు. 

''అన్నయ్యా.. నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది'' అని స‌త్యదేవ్ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన చిరంజీవి.. ''డియర్ సత్య‌దేవ్ కృత‌జ్ఞ‌త‌లు. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం. ఆచార్య‌లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. గాడ్ ఫాద‌ర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం'' అని చిరు పేర్కొన్నారు.
Go Back to Shorts
SatyaDev
Chiranjeevi
Tollywood

More Telugu News