Nokia G21: నోకియా నుంచి మరో చక్కటి ఫోన్.. జీ21 

Nokia G21 launched in India with 90Hz display 50MP triple camera setup
  • 4జీబీ ధర రూ.12,999
  • 6జీబీ ధర రూ.14,999
  • ఫోన్ తో బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఉచితం
హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ ‘నోకియా జీ 21’ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది వచ్చిన జీ 20 తర్వాతి వెర్షన్ ఇది. 6.5 అంగుళాల స్కీన్, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే కాదు. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో స్క్రీన్ కనిపిస్తుంది. 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. 

ఇందులో యూనిసాక్ టీ606 ఎస్ఓసీ ప్రాసెసర్ ను కంపెనీ వినియోగించింది.  5,050 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ, ఫోన్ తో పాటు వచ్చే చార్జింగ్ అడాప్టర్ కేవలం 10వాట్ సామర్థ్యంతోనే ఉంటుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపికల్స్ మెయిన్ కెమెరా కాగా, డెప్త్, మ్యాక్రో కోసం రెండు 2 ఎంపీ సెన్సార్లను ఏర్పాటు చేసింది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. 

ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తుంది. రెండేళ్ల పాటు సాఫ్ట్ వేర్ సపోర్ట్, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ కు కంపెనీ హామీ ఇచ్చింది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రకం ధర రూ.14,999. ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి మంచి ఆఫర్ ను కంపెనీ ప్రకటించింది. నోకియా బీహెచ్-405 టీడబ్ల్యూఎస్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ సెట్ ను ఉచితంగా ఇస్తోంది.
Nokia G21
lanched
smartphone
new

More Telugu News