Bonda Uma: మహిళా కమిషన్ ఉన్నది మహిళల హక్కులు కాపాడేందుకా? లేక వైసీపీ హక్కులను కాపాడేందుకా?: బోండా ఉమ

  • పెన్ను, పేపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇస్తున్నారు
  • చంద్రబాబు వస్తున్నారనే మేకప్ వేసుకుని హడావుడిగా వచ్చారు
  • అత్యాచారానికి గురైన మహిళకు అండగా నిలవడమే మేము చేసిన తప్పా?
Bonda Uma fires on Vasireddy Padma

ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ మరోసారి మండిపడ్డారు. మహిళా కమిషన్ కు కూడా లేని పవర్స్ ను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

పెన్ను, పేపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇస్తూ... కమిషన్ వద్దకు ఎందుకు రారో చూస్తానంటూ సవాళ్లు విసురుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉన్నది మహిళల హక్కులను కాపాడేందుకా? లేక వైసీపీ హక్కులను కాపాడేందుకా? అని ఆయన ప్రశ్నించారు. 

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చంద్రబాబు వస్తున్నారని తెలుసుకునే ఆమె హడావుడిగా మేకప్ వేసుకుని అక్కడకు వచ్చారని ఉమ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళకు అండగా నిలవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ విచారణకు తాము వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. 

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరామని చెప్పారు.

More Telugu News