Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలో చేరను... సలహాదారుగానే పనిచేస్తా: ప్రశాంత్ కిశోర్ ప్రకటన

Prashant Kishor statement about Congress party invitation
  • ఊహాగానాలకు తెర
  • కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదనకు నో చెప్పిన పీకే
  • పార్టీకి సలహాదారు అవసరమే ఎక్కువగా ఉందని వెల్లడి
  • పార్టీ సమూలంగా పునర్ నిర్మాణం జరగాలని సూచన
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారు. దీనిపై ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదని స్పష్టం చేశారు. ఆ పార్టీకి సలహాదారుగా మాత్రమే వ్యవహరిస్తానని వెల్లడించారు. 

పార్టీలోకి రావాలన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆహ్వానాన్ని ఆమోదించలేకపోతున్నానని తెలిపారు. తాను పార్టీలో ఉండడం కంటే సలహాదారుగా ఉండడమే అవసరమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి పునర్ నిర్మాణం జరగాల్సి ఉందని ఉద్ఘాటించారు. పార్టీ పునర్ నిర్మాణంలో కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు.
Prashant Kishor
Congress
Adviser
India

More Telugu News