Tamil Producer: మహిళను వేధించిన ప్రముఖ తమిళ సినీ నిర్మాత అరెస్ట్

Tamil producer Varahi arrested
  • రాణి అనే మహిళను వేధించిన వారాహి
  • ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధింపులు
  • భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన రాణి
ఒక మహిళను వేధిస్తున్న కేసులో ప్రముఖ తమిళ సినీ నిర్మాత వారాహిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని నటేసన్ నగర్లో ఒక బహుళ అంతస్తుల భవనంలో వారాహి నివసిస్తున్నాడు. అదే భవనంలో రాణి (31) అనే మహిళ కూడా ఉంటోంది. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆమెను గత కొన్ని రోజులుగా వారాహి వేధిస్తున్నాడు. 

తనకు ఇష్టం లేదని ఆమె చెపితే... చంపేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దీంతో భయపడిన ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారాహి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు. విచారణలో రాణిని వారాహి వేధించినట్టు నిర్ధారణ కావడంతో... కేసు నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేశారు.
Tamil Producer
Varahi
Arrest
Kollywood

More Telugu News