10 రోజులు 'ఆచార్య‌' టికెట్ ధ‌రలు పెంచుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి

ap govt good news to acharya
  • చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ 
  • టికెట్ ధ‌ర‌ రూ.50 పెంచుకునేందుకు అనుమ‌తి
  • ఐదో షో విషయంలో మాత్రం ఇంకా రాని స్ప‌ష్ట‌త 
మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను ఆ సినిమా విడుద‌లైన‌ ప‌ది రోజుల వ‌ర‌కు రూ.50 పెంచుకునేందుకు ఏపీ స‌ర్కారు అంగీకరించింది. ఐదో షో విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణ‌య‌మూ తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానున్న విష‌యం తెలిసిందే. 

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆట‌కు అనుమ‌తి ఇస్తూ, టికెట్ ధ‌ర‌లు ఏడు రోజుల వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఇస్తూ తెలంగాణ స‌ర్కారు కూడా ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్‌ చిత్రాలకు తొలి పది రోజుల పాటు టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అవ‌కాశాలు క‌ల్పిస్తోంది. కొర‌టాల శివ‌ వంటి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ చిరంజీవితో రూపొందించిన ‘ఆచార్య’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 


            
Go Back to Shorts
acharya
Tollywood
Andhra Pradesh
Telangana

More Telugu News