సరికొత్త ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
- కార్గో సేవలపై 25 శాతం డిస్కౌంట్
- 5 కేజీల బరువు వరకు రాయితీ వర్తింపు
- మే 3 వరకు అందుబాటులో ఉండనున్న ఆఫర్
ఇందులో భాగంగా ప్రతి పండుగ సందర్భంగా కొత్తకొత్త డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్ సందర్భంగా కార్గో, పార్సిల్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ప్రకటించారు. ఈ సదుపాయం మే 3 వరకు అందుబాటులో ఉంటుందని సజ్జనార్ తెలిపారు. 5 కేజీల బరువు వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పారు. ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829, 68153333 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.