KCR: యాదాద్రిలో కేసీఆర్‌ దంపతుల ప్రత్యేక పూజలు

kcr visits yadadri
  • పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆల‌య‌ పునర్నిర్మాణం
  • మహాక్రతువు ఉత్సవంలో పాల్గొనేందుకు యాదాద్రికి కేసీఆర్ 
  • కాసేప‌ట్లో మహా కుంభాభిషేకం
యాదాద్రి అభివృద్ధిలో భాగంగా పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన విష‌యం తెలిసిందే. ఇందులో మహాక్రతువు ఉత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రి ప్రధానాలయంలో కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కాసేప‌ట్లో మహా కుంభాభిషేకంలో పాల్గొననున్నారు.

ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించ‌నున్నారు. ఈ రోజు ఉద‌య‌మే శివాలయ యాగ శాలలో ద్వారతోరణం, శత రుద్రాభిషేకం, మహారుద్ర పురశ్చరణ, మూలమంత్రానుష్ఠానం, వేద హవనం నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు రుద్ర హవనం, ప్రాసాద స్నపనం, కూర్మశిల, బ్రహ్మశిల, పిండికా స్థాపనం నిర్వ‌హిస్తారు. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ ఉద్ఘాటన కార్యక్రమం జ‌రుగుతోంది.
KCR
TRS
Yadadri Bhuvanagiri District

More Telugu News