' భవదీయుడు భగత్ సింగ్'లో రవీనా టాండన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

' భవదీయుడు భగత్ సింగ్'లో రవీనా టాండన్!

Bhavadeeyudu Bhagath Singh movie update
  • ఈ నెల 14న వచ్చిన 'కేజీఎఫ్ 2'
  • పవర్ఫుల్ పాత్రలో కనిపించిన రవీనా 
  • పవన్ సినిమా కోసం సంప్రదించిన హరీశ్ శంకర్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవీనా 
బాలీవుడ్ నుంచి వచ్చిన చాలామంది హీరోయిన్స్ తెలుగు తెరపై మెరిశారు. అలాంటి సీనియర్ హీరోయిన్స్ లో రవీనా టాండాన్ ఒకరు. తెలుగులో ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ, బాలకృష్ణ సరసన చేసిన 'బంగారు బుల్లోడు' సినిమా ఆమెకి మంచి హిట్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె వరుస హిందీ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
 
'కేజీఎఫ్ 2' సినిమాలో రవీనా పోషించిన ప్రధానమంత్రి పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. రిమికా సేన్ అనే ఈ పవర్ఫుల్ పాత్రలో ఆమె గొప్పగా నటించింది. ఆ పాత్రలో నుంచి ఆమె ఎక్కడా బయటికి రాలేదు. ఈ మధ్య కాలంలో ఆమెకి దక్కిన మంచి పవర్ఫుల్ రోల్ ఇది. ఈ సినిమాలోని హైలైట్ ఎపిసోడ్స్ లో ఇది ఒకటి. 

ఈ సినిమా చూసిన హరీశ్ శంకర్, 'భవదీయుడు భగత్ సింగ్'లోని ఇక కీలకమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. రవీనా పాత్ర గురించి ఆమెకి చెప్పడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాతో రవీనా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని చెబుతున్నారు. ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా సందడి చేయనున్న సంగతి తెలిసిందే.
Pavan kalyan
Pooja Hegde
Raveena
Bhavadeeyudu Bhagath Singh

More Telugu News