Rajasthan Royals: పంచెలు కట్టారు కానీ ఎగ్గట్టడం రాలేదు... రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ల తంటాలు... వీడియో ఇదిగో!

Rajasthan Royals players Halla Bol
  • ఈ నెల 26న రాజస్థాన్ జట్టుకు తదుపరి మ్యాచ్
  • ఉల్లాసంగా గడిపిన ఆటగాళ్లు
  • పింక్ టీషర్లు, నల్ల పంచెలో ఆటగాళ్ల సందడి
  • వీడియో పంచుకున్న రాజస్థాన్ ఫ్రాంచైజీ

ఐపీఎల్ ఎంతో ఒత్తిడితో కూడుకున్న క్రికెట్ లీగ్. అందుకే ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు పలు ఉల్లాసకరమైన కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆటగాళ్లు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇక అసలు విషయానికొస్తే... రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఈ నెల 26న తమ తదుపరి మ్యాచ్ ఆడనున్నారు. 

ఈ క్రమంలో ఆటగాళ్లు 'హల్లా బోల్' పేరిట నూతన వేషధారణలో దర్శనమిచ్చారు. రాజస్థాన్ ఆటగాళ్లందరూ పంచెలు కట్టి దర్శనమిచ్చారు. అయితే వారికి పంచె ఎగ్గట్టడం మాత్రం చేతకాక తంటాలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది. కెప్టెన్ సంజు శాంసన్, చహల్, యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్ల పంచె కట్టులో సందడి చేశారు.

  • Loading...

More Telugu News