Youth: బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని అర్ధనగ్నంగా ట్రాక్టర్ పై ఊరేగించిన గ్రామస్థులు

Villagers tied and thrashed youth in Haveri district
  • కర్ణాటకలో ఘటన
  • 16 ఏళ్ల బాలికపై యువకుడి లైంగికదాడి
  • చితకబాదిన గ్రామస్థులు 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడి తండ్రి
కర్ణాటకలోని హవేరి జిల్లా హీరెకరూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. అదే గ్రామానికి చెందిన యువకుడు సదరు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో గ్రామస్థులు ఆ యువకుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని అర్ధనగ్నంగా ట్రాక్టర్ పై గ్రామంలో ఊరేగించారు. 

అయితే, ఆ యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు, యువకుడ్ని కూడా అదుపులోకి తీసుకుని అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువకుడ్ని ట్రాక్టర్ పై ఊరేగించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Youth
Tractor
Haveri District
Karnataka

More Telugu News