Raveena Tandon: హీరోయిన్ కాకముందు రవీనా టాండన్ ఏం చేసేవారో తెలుసా?

Before becoming heroine Raveena Tandon worked as floor cleaner
  • తొలి రోజుల్లో ఒక స్టూడియోలో ఫ్లోర్ తుడిచే పని చేసిన రవీనా
  • ఎవరైనా వాంతి చేసుకుంటే అక్కడ శుభ్రం చేయాల్సి వచ్చేది 
  • ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టిన వైనం

బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ తన అందం, అభినయంతో చాలా కాలం పాటు అగ్ర నటీమణుల్లో ఒకరిగా కొనసాగారు. ఇప్పుడు కూడా మంచి పాత్రలను పోషిస్తూ నటిగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అసలు హీరోయిన్ కాకముందు రవీనా టాండన్ ఏం చేసేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

తొలి రోజుల్లో ఆమె ఒక స్టూడియోలో ఫ్లోర్ తుడిచేవారు. ఎవరైనా అక్కడ వాంతి చేసుకుంటే వెంటనే శుభ్రం చేసే పని చేసేవారు. ఇలాంటి పనులు ఆమె చాలా చేశారు. ఆ తర్వాత ఆమె ప్రహ్లాద్ కక్కర్ వద్ద అసిస్టెంట్ గా చేశారు. ఆ సమయంలో ఎవరైనా మోడల్ టైమ్ కి రాకపోతే రవీనాకు మేకప్ వేసి, పోజులు ఇవ్వమనేవారు. ఆ విధంగా ఆమె మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినీ అవకాశాలు కూడా రావడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సినిమాల్లోకి రాకముందు ఆమెకు యాక్టింగ్, డ్యాన్స్ ఏమీ తెలియవు. హీరోయిన్ అయిన తర్వాతే ఆమె ఇవన్నీ నేర్చుకున్నారు.
Raveena Tandon
Bollywood

More Telugu News