CM Jagan: సీఎం జగన్ కు గిఫ్ట్ అందించిన బాలినేని కుమారుడు

Balineni Pranith Reddy gifts CM Jagan
  • నేడు ఒంగోలుకు వచ్చిన సీఎం జగన్
  • సున్నా వడ్డీ నిధుల విడుదల
  • సీఎంకు ఒంగోలు గిత్త ప్రతిమను అందించిన బాలినేని ప్రణీత్
  • సీఎం జగన్ మహిళల పక్షపాతి అన్న మాజీమంత్రి బాలినేని

ఏపీ సీఎం జగన్ ఇవాళ ఒంగోలు విచ్చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు మూడో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి ఓ జ్ఞాపిక అందజేశారు. ఒంగోలు గిత్త ప్రతిమను వేదికపై సీఎంకు అందించారు. సీఎం జగన్ చిరునవ్వుతో ప్రణీత్ రెడ్డిని ఆహ్వానించి, జ్ఞాపికను అందుకున్నారు. అంతకుముందు, మాజీమంత్రి బాలినేని మాట్లాడుతూ, సీఎం జగన్ మహిళల పక్షపాతి అన్నారు. మహిళలకు పెద్ద పీట వేయడానికి సీఎం జగన్ ముందుంటారని తెలిపారు.

  • Loading...

More Telugu News