MIKE TYSON: విమానంలో యువ‌కుడి ముఖంపై పిడిగుద్దులు కురిపించిన మైక్ టైసన్.. వీడియో ఇదిగో

  • అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడాకు టైస‌న్
  • జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానంలో ఉండ‌గా ఘ‌ట‌న‌
  • ఓ యువకుడు పదే పదే మాట్లాడుతుండ‌డంతో  టైస‌న్‌కు ఆగ్ర‌హం
 Viral Video MIKE TYSON PUNCHES man

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ విమానంలో ఓ యువ‌కుడిని కొట్టాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్ టైస‌న్ జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కాడు. అందులో ఆయ‌న వెనుక సీటులో కూర్చున్న ఓ యువకుడు పదే పదే మాట్లాడుతుండ‌డంతో మైక్ టైస‌న్‌కు కోపం వ‌చ్చింది. త‌న‌తో మాట్లాడ‌వ‌ద్ద‌ని అత‌డికి మైక్ టైస‌న్ చెప్పాడు. అయినప్పటికీ ఆ యువకుడు వినలేదు. 

ఆ యువ‌కుడు అలాగే వాగుతూ ఉండ‌డంతో మైక్ టైసన్ ఆగ్ర‌హంతో ఊగిపోతూ అత‌డి వ‌ద్ద‌కు వెళ్లి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో ఆ యువకుడి ముఖానికి గాయాల‌య్యాయి. తోటి ప్రయాణికులు టైస‌న్‌ను శాంతింప‌జేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.  
     

More Telugu News