Jammu And Kashmir: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. లష్కరే అగ్ర కమాండర్ హతం

Top LeT commander and 2 terrorists killed in Baramulla
  • లష్కరే కమాండర్ కంత్రూతోపాటు మరో ఇద్దరి హతం
  • పలువురి హత్యలో కంత్రూ పాత్ర
  • ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లకు గాయాలు
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. 

ఈ ఘటనలో లష్కరే తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక పోలీసు అధికారి, అతడి సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్యల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు.
Jammu And Kashmir
Baramulla
Encounter
LeT

More Telugu News