Roja: నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చింది ఆయనే: రోజా

Ex MP Siva Prasad took me in to films says Roja
  • తిరుపతిలో రోజాను సన్మానించిన హోటల్ అసోసియేషన్
  • తనను సినిమాల్లోకి తీసుకెళ్లింది శివప్రసాద్ అని చెప్పిన రోజా
  • తిరుపతి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ

రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ, తనదైన శైలిలో రాణిస్తూ చివరకు తన చిరకాల స్వప్నమైన మంత్రి పదవిని రోజా చేపట్టారు. సీఎం జగన్ ఆమెకు పర్యాటక, సాంస్కృతిక, యూత్ వెల్ఫేర్ శాఖలను కట్టబెట్టారు. మంత్రి పదవిని చేపట్టిన రోజాను తిరుపతిలో ఏపీ హోటల్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పలు విషయాలను పంచుకున్నారు. చదువుకుంటున్న తనను సినీ రంగంలోకి తీసుకెళ్లింది మాజీ ఎంపీ, దివంగత శివప్రసాదేనని చెప్పి, ఆయనను గుర్తు చేసుకున్నారు. పర్యాటక రంగానికి సంబంధించి హోటళ్లు ప్రధాన భూమికను పోషిస్తాయని చెప్పారు. కరోనా వల్ల హోటల్ నిర్వాహకులు చాలా నష్టపోయారని తెలిపారు. తిరుపతిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు పాత్రను పోషిస్తానని చెప్పారు. 

తిరుపతి వాసిగా చంద్రగిరి కోట అభివృద్ధికి కృషి చేస్తానని రోజా తెలిపారు. ఏపీ టూరిజంకు టీటీడీ దర్శన టికెట్ల కోటాను పెంచేలా యత్నిస్తానని హామీ ఇచ్చారు. హోటల్ నిర్వాహకుల విన్నపం మేరకు హోటళ్ల పనివేళలను పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఏపీలోని అన్ని పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా ఒక యాప్ ను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మంత్రిగా రాష్ట్రం కోసం ఎంత కష్ట పడతానో... సొంత ప్రాంతమైన తిరుపతి అభివృద్ధికి కూడా అంతే కష్టపడతానని రోజా చెప్పారు.

  • Loading...

More Telugu News