Pakistan: బాప్‌రే! నాలుగేళ్లలో ఇమ్రాన్ హెలికాప్టర్ ఖర్చు రూ. 40 కోట్లా!!

  • ప్రధాని అధికారిక నివాసం నుంచి ఇంటికి వెళ్లేందుకు హెలికాప్టర్
  • మూడున్నరేళ్ల కాలంలో 984 మిలియన్ పాక్ రూపాయల ఖర్చు అయిందన్న పాక్ మంత్రి
  • 20 శాతం సొమ్ము చెల్లించి 5.7 కోట్ల విలువైన కానుకలను సొమ్ము చేసుకున్నారని ఆరోపణ
Imran Khans helicopter commute cost Rs 40 Cr during his tenure

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన హయాంలో ప్రధాని అధికారిక నివాసం నుంచి తన ఇంటికి వెళ్లేందుకు ఏకంగా రూ. 40 కోట్లు ఖర్చు చేసినట్టు ఆ దేశ సమాచార మంత్రి మరియం ఔరంగజేబు తెలిపారు. ప్రధాని నివాసం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బానీగాలలోని తన ప్రైవేటు నివాసానికి రాకపోకలు సాగించేందుకు ఇమ్రాన్ హెలికాప్టర్ ఉపయోగించేవారు. ఇందుకోసం ఏకంగా 984 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 40 కోట్లు) ఖర్చు అయినట్టు మంత్రి ఔరంగజేబు నిన్న మీడియాకు వెల్లడించారు. 

జూన్ 2018 నుంచి మార్చి 2022 వరకు ఇమ్రాన్ ఈ ఖర్చు పెట్టినట్టు తెలిపారు. ఈ మొత్తం ఖర్చులో 472 మిలియన్లు ప్రయాణానికి అయిన ఖర్చు కాగా, మిగతాది హెలికాప్టర్ నిర్వహణకు అయిన ఖర్చని తెలిపారు. అలాగే, కానుకలుగా అందిన వాటికి ఇమ్రాన్ 20 శాతం డబ్బులు చెల్లించి రూ. 5.7 కోట్లు (142 మిలియన్ రూపాయలు) సొమ్ము చేసుకున్నట్టు మంత్రి మరియం మీడియాకు తెలిపారు.

More Telugu News