Social Media: నిశ్చితార్థం కోసం వచ్చిన వరుడి కుటుంబం.. డీజే శబ్దానికి ఆగిన యువకుడి తండ్రి గుండె!

bridegroom father died after hear DJ Sound in Odishas Malkangiri
  • సోషల్ మీడియా ద్వారా యువతితో పరిచయం
  • పెళ్లికి అంగీకరించిన ఇరు కుటుంబాలు
  • నిశ్చితార్థానికి ఢిల్లీ నుంచి మల్కన్‌గిరి చేరుకున్న వరుడి కుటుంబం
  • డీజేను ఒక్కసారిగా ఆన్ చేయడంతో గుండెపోటుతో వరుడి తండ్రి మృతి
నిశ్చితార్థానికి వచ్చిన వరుడి కుటుంబంలో విషాదం నిండుకుంది. డీజే శబ్దానికి యువకుడి తండ్రి గుండె ఆగి మరణించాడు. ఒడిశాలోని మల్కన్‌గిరిలో జరిగిందీ విషాద ఘటన. ఢిల్లీకి చెందిన అంకిత్‌కు మల్కన్‌గిరికి చెందిన యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది ముదిరి ప్రేమగా మారింది. విషయం పెద్దలకు చెప్పడంతో ఇరు కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించాయి.

దీంతో నిశ్చితార్థం చేసుకునేందుకు యువకుడి కుటుంబం ఢిల్లీ నుంచి బుధవారం మల్కన్‌గిరి చేరుకుంది. లాడ్జీలో బసచేసిన వారిని తీసుకెళ్లేందుకు వధువు తరపు కుటుంబం మేళతాళాలతో చేరుకుంది. ఈ క్రమంలో డీజేను ఒక్కసారిగా ఆన్ చేయడంతో ఆ శబ్దానికి వరుడి తండ్రి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. దీంతో నిశ్చితార్థం జరగాల్సిన చోట విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఢిల్లీకి పంపే ఏర్పాట్లు చేశారు.
Social Media
Bridegroom
Odisha
New Delhi
Malkangiri

More Telugu News