Surya: 'కేజీఎఫ్' నిర్మాతలతో సుధా కొంగర మూవీ!

Surya in Sudha Kongara Movie
  •  దర్శకురాలిగా తమిళంలో వరుస సినిమాలు 
  •  'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం 
  • 'ఆకాశం నీ హద్దురా'తో దొరికిన హిట్
  • మరోసారి సూర్యతో చేసే ఛాన్స్ 

దర్శకురాలిగా సుధా కొంగరకి మంచి పేరుంది. ఆమె ఎంచుకునే కథలు వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటాయి. సహజత్వానికి అద్దం పడుతుంటాయి. తమిళంలో దర్శకురాలిగా సుధా కొంగరకి మంచి గుర్తింపు ఉంది. ఆ మధ్య తమిళంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఆమె చేసిన సినిమానే, తెలుగులో 'గురు' టైటిల్ తో రీమేక్ చేయగా, హిట్ కొట్టింది. 

ఇక ఆ తరువాత సూర్య కథానాయకుడిగా తమిళంలో ఆమె చేసిన 'సురారైపోట్రు' .. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో  ప్రేక్షకులను పలకరించింది. సుధా కొంగరతో పాటు సూర్యకి కూడా ఈ సినిమా ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఈ సారి కూడా ఆమె వాస్తవ సంఘటనల ఆధారంగానే ఒక కథను సిద్ధం చేసుకున్నారు.

కన్నడలో ' కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాలో హీరో ఎవరనేది చెప్పలేదుగానీ, దాదాపు సూర్యనే చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇది ఏ జోనర్ కి సంబంధించినదనే విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.

  • Loading...

More Telugu News