Corona Virus: ఇక చిన్నారులకు కరోనా వ్యాక్సిన్... రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి
- 5-12 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్
- కార్బివ్యాక్స్, కోవాగ్జిన్‌లకు అనుమతి నిచ్చిన నిపుణుల కమిటీ
- త్వరలోనే చిన్నారుల వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రకటన
దేశంలో చిన్నారులకూ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి గురువారం నిపుణుల కమిటీ ప్రకటన చేసింది. 5-12 ఏళ్ల వయసు పిల్లల కోసం రెండు వ్యాక్సిన్‌లను వేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చిన్న పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కార్బివ్యాక్స్‌తో పాటు కోవాగ్జిన్‌కు కూడా అనుమతి ఇస్తూ నిపుణుల కమిటీ ప్రకటన విడుదల చేసింది. దీంతో త్వరలోనే 5-12 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.